రాణించిన ధోని, డుప్లెసిస్.. చెన్నై ఘన విజయం

SMTV Desk 2019-04-08 12:57:39  Chennai, KXIP

చెన్నై : చెపాక్ వేదికగా పంజాబ్‌తో జరిగినమ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. ధోనీసేన 22 పరుగుల తేడాతో కింగ్స్‌ లెవెన్ పంజాబ్‌ను మట్టికరిపించింది. ఇక లక్ష్యచేధనలో పంజాబ్ చతికిలపడింది. మొదట్లోనే పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రాహుల్, సర్ఫరాజ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. సింగిల్స్ తీస్తూ స్కోర్‌బోర్డును మెల్లిగా ముందుకు కదిలించారు. అయితే చివర్లో పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. చివరి ఓవర్‌లో 25 పరుగులు అవసరం కాగా.. పంజాబ్ 3 పరుగులే చేసింది. దీంతో చెన్నై విజయం లాంఛనమైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. 20 ఓవర్లకు 160 పరుగులు చేసింది. చెన్నై ఓపెనర్లు వాట్సన్ 26, డుప్లెసిస్ 54 రన్స్ చేసి శుభారంభాన్ని అందించారు. తర్వాత సురేష్ రైనా కాసేపు వికెట్ కాపాడుకున్నాడు. ధోనీ, అంబటి రాయుడు కాస్త నెమ్మెదిగా ఆడినా చివర్లో బౌండరీలతో చెలరేగారు.