పవన్ కళ్యాణ్ రోడ్డున పోయే పిచ్చివాడు

SMTV Desk 2019-04-08 12:55:18  botsa, Pawan Kalyan

ఏపీలో ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ఆయా పార్టీల మధ్య నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. విమర్శలు ప్రతివిమర్శలతో వాగ్ధాటి చూపుతున్నారు. విజయనగరంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ రోడ్డున పోయే పిచ్చివాడు. పిచ్చివాడి మాటలకు, ఉన్మాది మాటలకు ఏం సమాధానం చెబుతాం. 2009 లో నేను మంత్రిని. నేను ఆయన్ని బ్రతిమిలాడుకోవడం ఏంటి. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు. మేమేమిటో జిల్లా ప్రజలకి తెలుసు. నేను మంత్రిగా ఉండగా విజయనగరంలో ఏ పరిశ్రమలు మూతపడ్డాయో చెప్పాలి. ఎవరి హయాంలో మూతపడ్డాయో వారిని ప్రశ్నించాలి కానీ.. వారితో మ్యాచ్ ఫిక్సింగులు చేసుకుంటున్నారు అంటూ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ పై విరుచుకు పడ్డారు.