దక్షిణ కొరియాలో 5జీ

SMTV Desk 2019-04-04 21:40:52  south korea, 5g serives

దక్షిణ కొరియా : ప్రపంచంలోనే మొట్టమొదటి‌సారి దక్షిణ కొరియా ఈ శుక్రవారం నుండి 5జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఉన్న 4జీతో పోలీస్తే 5జీ డేటా వేగం 20 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ), వర్చువల్​ రియాలిటీ (వీఆర్​) పరికరాలకూ ఇంటర్‌నెట్‌ను వేగంగా అందజేసేందుకు 5జీ ఉపయోగపడుతుంది. దీని వల్ల స్మార్ట్ సిటీలు, అటానమస్ కార్ల రంగం అభివృద్ధి చెందుతుందని, కనిష్ఠ స్థాయికి పడిపోయిన దక్షిణ కొరియా దేశ ఆర్థిక వృద్ధీ పెరుగుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కోరియాలోని కొన్ని టాప్ ఆపరేటర్లైన ఎస్కే టెలికాం, కేటీ కార్ప్ సంస్థలు వినియోగదారులకు అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది. అయితే హువావే ఫోన్లలో తమ 5జీ నెట్‌వర్క్ పనిచేయదని ఆ రెండు సంస్థలు పేర్కొన్నాయి.