5డీ పోర్న్ థియేటర్స్....

SMTV Desk 2019-04-04 18:45:38  Amsterdamned, Netherlands, 5d porn theaters

ఆమ్స్టర్డామ్ : నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్స్టర్డామ్ నగరంలో ఈ మధ్యే ప్రారంభించిన ఓ సినిమా థియేటర్ వింత కార్యకలాపాలకు పాల్పడనుంది. ఆసియా దేశాలాన్ని పోర్న్ను పూర్తిగా నిషేధించాలని పట్టుపట్టి కూర్చుంటే...దీనికి పూర్తి విరుద్దంగా ఆమ్స్టర్డామ్ నగరంలోని థియేటర్‌లో 5డి పోర్న్ ప్రదర్శిస్తారట. ఇటువంటి థియేటర్ ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం విశేషం. కొన్ని కొన్ని దేశాల్లో పోర్న్ పై ఎటువంటి చర్యలు తీసుకోరు...అలాగని వాటిని ఎక్కడ ఏ థియేటర్ లో వెయ్యరు. కానీ ఆ థియేటర్ యాజమాన్యం ఈ సాహసం చేసి వార్తల్లోకి ఎక్కింది. ఆమ్స్టర్డామ్ నగరం ప్రపంచంలోని మిగతా నగరాలకు విభిన్నంగా ఉంటుంది. అన్నే ఫ్రాంక్ హౌస్ (వాన్ గొగ్ మ్యూజియం)లో అడుగు పెడితే ఎన్నో సెక్స్ డాల్స్ దుకాణాలు కనిపిస్తాయి. మరోవైపు వ్యభిచార గృహాల్లో షోకేసుల్లో పెట్టినట్లుగా అమ్మాయిలు నిలుచుని విటులను ఆకర్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ కొత్తగా 5డి పోర్న్ సినిమా థియేటర్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఈ థియేటర్‌లో అడుగుపెట్టగానే 3డి సినిమాకు ఉపయోగించే కళ్ల అద్దాలను ఇస్తారు. అవి పెట్టుకుంటే పోర్న్ సినిమాలో నటీ నటులు వీక్షకుల మధ్యలోనే సెక్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ సమయంలో ప్రేక్షకుల కుర్చీలు కూడా వెనక్కి ముందుకు ఊగుతూ వారే సెక్స్ చేస్తున్న అనుభూతి కలిస్తాయట. ఆ సమయంలో హాల్ మొత్తం సుగంధాలతో నిండిపోతుందట. సాధారణ 3డి అయితే, కళ్లకు మాత్రమే వినోదాన్ని ఇస్తాయని, 5డిలో మాత్రం శరీరంలోని అన్నిభాగాలకూ వినోదాన్ని ఇస్తాయని థియేటర్ యాజమాన్యం చెబుతోంది. సాధారణ పోర్న్ సినిమాలను ఇందులో ప్రదర్శించడం కష్టమని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ‘కిమ్ హోలాండ్’ అనే డచ్ పోర్న్ సినిమాల నిర్మాణ సంస్థకు 5డి సినిమాలు తీసే బాధ్యత అప్పగించామన్నారు. గంటకు ఒకటి చొప్పున రోజుకు 6 షోలు ప్రదర్శిస్తామని తెలిపారు.