‘మహర్షి’ టీజర్ టైమ్ ఫిక్స్..!

SMTV Desk 2019-04-04 18:42:35  maharshi,

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘మహర్షి’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం టీజర్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్ 6న ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారకంగా ప్రకటించింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.