"రాజా ది గ్రేట్" టీజర్ రిలీజ్..

SMTV Desk 2017-08-15 14:51:00  raviteja, movie, raja the great, teaser

హైదరాబాద్, ఆగస్ట్ 15 : ఎన్నో వివాదాల నుంచి బయటపడి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో "రాజా ది గ్రేట్" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రవితేజ. అయితే రవితేజ ఈ చిత్రంలో కంటి చూపు లేని వ్యక్తిగా నటిస్తుండడం విశేషం. తన కెరీర్లోనే ఈ పాత్ర పోషించడం ఇదే మొదటిసారి. కాగా ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రబృంద౦. ఈ టీజర్ లో "నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు. కానీ నా కొడుకేంటన్నది మాత్రం ఈ ప్రపంచం చూడాలి" అంటూ రాధిక చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను కట్టి పడేసింది. అదే కాకుండా "అయామ్ బ్లైండ్ .. బట్ అయామ్ ట్రైన్డ్" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ కూడా అదిరిపోవడంతో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుకుంటున్నారు అభిమానులు.