ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్

SMTV Desk 2019-04-04 18:39:06  Chattisghar, Terrorist

ఛత్తీస్‌గఢ్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్‌లో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతిచెందిన జవాన్లు 114వ బెటాలియన్‌కు చెందిన వారిగా గుర్తించారు.