ఇండియా ఒక టారిఫ్‌ కింగ్‌!

SMTV Desk 2019-04-04 18:31:04  india, america, donald trump, gst, tax

వాషింగ్టన్‌ : భారత్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా అమెరికాలోని నేషనల్‌ రిపబ్లికన్‌ కాంగ్రెస్‌ కమిటీ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ....ప్రపంచంలోనే అత్యధికంగా పన్నులు విధించే దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఆయన అన్నారు. భారత్‌ హార్లీ డేవిడ్‌సన్‌ బైకులు వంటి కొన్ని రకాల వస్తువులపై 100శాతం పన్నులు విధిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అటువంటి అత్యధిక పన్నులు ఏమాత్రం మంచివికావని హితవు పలికారు. టారిఫ్‌ కింగ్‌గ అని భారత్‌ను పలుమార్లు ఎద్దేవా చేశారు. అమెరికా వస్తువులపై పన్నులను అద్భుతంగా వసూలు చేస్తుందని ఆయన అన్నారు. భారత్‌ అత్యధిక పన్నులు విధించే దేశం. మన వస్తువులపై 100శాతం పన్నులు విధిస్తారు. కానీ వారు మాత్రం ఇక్కడ మోటార్‌ సైకిళ్లను విక్రయించి బాగా సంపాదిస్తారు. మనం హార్లీ డేవిడ్‌సన్‌ను పంపిస్తే మాత్రం 100శాతం పన్ను విధిస్తారు. ఇది ఏమాత్రం బాగోలేదు. అని అన్నారు.