డయాబెటిస్ ఉన్నవాళ్లు అన్నం తినొచ్చా ?

SMTV Desk 2019-04-04 18:27:06  diabeties

అన్నం పరబ్రహ్మస్వరూపం.. ఏం తిన్నా అన్నంకి సమానం కాదు. అందులోనూ మనం భోజన ప్రియులం. కానీ, షుగర్ వ్యాధి వస్తే అన్నం మానేయడం ఉత్తమమని చెబుతుంటారు. అయితే, ఇందులో కొంత అవాస్తవం, కొంత నిజం ఉంది. అదేంటంటే.. అన్నంపూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.. మితంగా తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. ఎందుకంటే.. అన్నంలో గ్లిసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని వల్ల బ్లడ్ షుగర్‌లో మార్పు వస్తుంది. అన్నం తీసుకున్నప్పుడు అన్నం మాత్రమే తీసుకోం అందులో కూర, పప్పు, పెరుగు ఇలా అన్నీ యాడ్ అవుతాయి. అప్పుడు గ్లిసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది కాబట్టి అన్నం తినొచ్చు.
అయితే, అన్నం తినొచ్చు అని ఎక్కువగా తీసుకోకూడదు. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా, ఓ పూట అన్నం తీసుకుంటే మరో పూట టిఫిన్స్, చపాతీ, పుల్కాలు తినాలి. దీనితో పాటు తాజా కూరగాయలు, నీటిని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం అసలు మరిచిపోవద్దు. రోజూ ఓ 30 నిమిషాలు ఏదైనా ఓ వ్యాయామం చేయాలి. లేకపోతే వాకింగ్ అయినా చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల షుగర్ మాత్రమే కాదు.. ఇతర సమస్యలేవీ దరిచేరవు..