అల్లు అర్జున్ తో త్రివిక్రం సినిమా ఉంటుందా?

SMTV Desk 2019-04-04 18:20:30  Allu Arjun, Trivikram

నా పేరు సూర్య తర్వాత ఏడాది పాటు సినిమా కథలనే వింటూ వస్తున్న అల్లు అర్జున్ ఫైనల్ గా త్రివిక్రం తో సినిమా కన్ఫాం చేశాడు. అల్లు అర్జున్ 19వ సినిమా త్రివిక్రం తో.. 20వ సినిమా సుకుమార్ తో చేస్తాడని అంటున్నారు. త్రివిక్రంతో కథ విషయంలో చెరో మాట అవుతుందట. అందుకే బన్నితో త్రివిక్రం సినిమా క్యాన్సిల్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. బన్నిని కాదని త్రివిక్రం మహేష్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడట.

మహేష్ తో త్రివిక్రం అతడు, ఖలేజా సినిమాలు చేశాడు. మరోసారి కలిసి చేస్తే హ్యాట్రిక్ మూవీ అవుతుంది. మరి అల్లు అర్జున్ తో త్రివిక్రం సినిమా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. త్రివిక్రం సినిమా కాదనుకుంటున్న బన్ని సుకుమార్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడట. అది కూడా మహేష్ కు వినిపించిన కథతోనే సుకుమార్ బన్నితో సినిమా చేస్తాడని తెలుస్తుంది.