ఐపీఎల్....ముంభై @100

SMTV Desk 2019-04-04 17:13:02  mi, ipl

ముంబై : ఐపిఎల్‌లో సీజన్లో భాగంగా నిన్న ముంభై లోని వాంఖేడ్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ముంభై చెన్నైపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ముంబై మరో అరుదైన రికార్డు సృష్టించింది. ముంబై జట్టు ఐపీఎల్ లీగ్‌లో 100వ విజయంను నమోదు చేసింది. మొత్తం 175 మ్యాచులలో 100 విజయాలు (56.85 శాతం) సాధించింది. ఈ జాబితాలో ముంబయి తర్వాత 93 విజయాలతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండవ స్థానంలో కొనసాగుతోంది.

జట్ల విజయాలు :

ముంబయి ఇండియన్స్‌ - 100(175 మ్యాచులు).
చెన్నై సూపర్‌ కింగ్స్‌ - 93 (152 మ్యాచులు).
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ - 88 (167 మ్యాచులు).
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ - 83 (171 మ్యాచులు).
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ - 79 (166 మ్యాచులు).
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు - 79 (171 మ్యాచులు).
రాజస్థాన్‌ రాయల్స్ - 71 (137 మ్యాచులు).
దిల్లీ క్యాపిటల్స్‌ - 69 (165 మ్యాచులు).
రైజింగ్‌ పుణె సూపర్‌ గెయింట్స్‌ - 15 (30 మ్యాచులు).
గుజరాత్‌ లయన్స్ - 13 (30 మ్యాచులు).
పుణె వారియర్స్‌ ఇండియా - 12 (46 మ్యాచులు).
కోచి టస్కర్స్‌ కేరళ - 6 (14 మ్యాచులు).