ఏప్రిల్ 8న ఇంటర్ ఫలితాలు!

SMTV Desk 2019-04-04 16:58:48  inter results,

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందే ఇంటర్‌ విద్యార్థుల పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్‌ 8న ఇంటర్‌ సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా అనివార్య సమస్యలు వస్తే 9న వెల్లడించనున్నారు. ఈనెల 4వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికానుంది.

ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు ఒకేరోజు విడుదల చేస్తే వెబ్‌సైట్‌ తెరుచుకోవడంలో సమస్యలు రావచ్చని భావిస్తున్న అధికారులు.. ఫస్ట్ ఇయర్ ఫలితాలు 8న విడుదల చేసి, 9న సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 11న తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో అంతకుముందే ఫలితాలు ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంది. అందుకు తగినట్లు మూల్యాంకన కార్యక్రమాన్ని 4వ తేదీకే పూర్తిచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1300 పరీక్ష కేంద్రాల్లో 9,42,719 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు.