‘ప్రియతమా ప్రియతమా’ మేకింగ్ సాంగ్

SMTV Desk 2019-04-04 16:52:11  Majili,

నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మజిలీ’. పెళ్లైన తర్వాత తొలిసారిగా నాగచైతన్య, సమంత కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి మరో సాంగ్‌ మేకింగ్ సాంగ్‌ న చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. చైతన్య ప్రసాద్‌ రాసిన ప్రియతమా ప్రియతమా పాటను చిన్మయి శ్రీపాద పాడారు. ఈ పాటకు మంచి స్పందన వచ్చింది. చిత్రం విడుదల దగ్గర పడడంతో ఇవాళ ఈ పాట మేకింగ్‌ వీడియోను షైన్‌ స్క్రీన్స్‌ ప్రేక్షకులతో పంచుకుంది.



ప్రియతమా ప్రియతమా అంటూ వచ్చే పాట.. చాలా భావోద్వేకంగా ఉంటుదని చైసామ్‌ చెప్పారు. వీడియోలో ఈ పాట షూట్‌ చేసిన ప్రదేశాలను చూపించారు. గోపీ సుందర్ మ్యూజిక్‌ కంపోజ్‌ చేయగా.. థమన్‌ ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. చైసామ్‌ కలిసి నటించిన నాలుగో చిత్రం ఇది. కేరళలో ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌ తో ఈ చిత్రం విడుదల కానుంది. ఏప్రిల్‌ 5న ‘మజిలీ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.