రూ. 377.511 కోట్లు స్వాధీనం

SMTV Desk 2019-04-04 16:50:18  cash seized,

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ క్రమంలో తొలి విడత నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి దేశంలో ఎన్నికల కోడ్‌ అమలవుతోంది. దీంతో పోలీసులు దేశ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ. 377.511 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రూ. 157 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 705 కోట్ల విలువ చేసే డ్రగ్స్, రూ. 312 కోట్ల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున రూ. 50 వేల నగదు కంటే ఎక్కువ తీసుకెళ్లే వారు, దానికి సంబంధించిన ఆధారాలు అధికారులకు చూపాల్సిందేనని, లేని పక్షంలో ఆ నగదును అధికారులు సీజ్‌ చేస్తారని పోలీసులు తెలిపారు. బంగారం, వెండి ఆభరణాలు తీసుకెళ్లిన తప్పనిసరిగా రశీదులు ఉండాలని వారు వెల్లడించారు.