మూడు నవ్వులు.. ఆరు కిస్సులు.. తో కేఏపాల్ ప్రచారం

SMTV Desk 2019-04-04 16:49:18  ka paul

ఏపీలో రాజకీయాలు చాలా హాట్ గా మారుతున్నాయి. ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు చాలా తీవ్రంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, వైసీపీ, బీజేపీలు చాలా సీరియస్ గా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి.

అయితే ఈ మధ్యనే ఈ ఎన్నికలకే.. చంద్రబాబు స్కెచ్ లో భాగంగా రాజకీయ పార్టీతో ముందుకు వచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రచారం మాత్రం మూడు నవ్వులు.. ఆరు కిస్సులు.. తొమ్మిది బాక్సింగ్ కిస్సులతో వన్ మ్యాన్ ఆర్మీగా ముందుకు దూసుకుపోతుంది. అయితే తాజాగా అనే కాదులే... ఆయన ఎన్నికల హడావుడి మొదలు పెట్టించినప్పటి నుంచి మంచి వక్తగా హెలికాప్టర్ నామ స్మరణ చేస్తూ... మీడియాకు మంచి ఎంటర్టైనర్ గా మారారు. ఇంకేమింకేం కావాలి అన్నట్లుగా మీడియా కూడా ఆయన్ని పలు రకాలుగా వాడుకుంటుంది. సీరియస్ పాలిటిక్స్ పొలిటికల్ జోకర్ గా చిత్రీకరిస్తూ... కేఏపాల్ ను మంచి ఎంటర్టైనర్ గా మార్చేసింది. మొత్తానికి నామినేషన్ల పర్వం మొదలుకొని ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్న కేఏపాల్ రాజకీయాల్లో విశ్లేషకులు భావిస్తున్నట్లుగా ఏపీ సీఎం చంద్రబాబు టూల్ గా ఈ జోకర్ ఉపయోగపడుతున్నాడా.. లేకా కేఏపాల్ కి బాబు అస్త్రంగా మారాడా అనేది తెలియకుండా ఉంది. మొత్తానికి అలా కేఏపాల్ ని దించడంలో బాబు అస్త్రమే ఉన్నట్లైతే ఇలాంటి వెకిలి చేష్టలతో కూడిన రాజకీయాలు చేస్తాడా అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది.

అదేవిధంగా ఒకవేళ కేఏపాల్ నిజంగా బాబు విడిచిన బాణమే అయితే ఎస్సీ ఓట్ బ్యాంక్ ను కొల్లగొట్టే సత్తా ఈ జోకర్ ఉందా? అనేది కూడా మీడియా పాల్ ను డైల్యూట్ చేయడంతో అదీ తేలిపోయింది. మరెందుకు బాబు కేఏ పాల్ ను దింపినట్లు. అయితే ఇక్కడో రహస్యమేమంటే... కేఏపాల్ వి లక్షల కోట్ల రూపాయలు అలా బ్యాంకులలో ఆగిపోవడంతో పలువురు నాయకులను గెలిపించుకొని తమ వద్దకు రమ్మని.. ఆ విధంగా తమ డబ్బు వచ్చేందుకు తాను వీలు కల్పిస్తామని బాబు భరోసా ఇవ్వడంతో కేఏపాల్ ఆ రకంగా రాజకీయాలు చేస్తూ... ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారని టాక్ మరి. ఈ జోకర్ కి నాలుగు ఓట్లైన పడతాయా?.. నిజంగా వైసీపీ ఓటు బ్యాంక్ ను తనవైపు తిప్పుకొనే సత్తా కేఏపాల్ కి ఉందా? అంటే అది ఒట్టి మాటలే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. చూద్దాం మరి కేఏపాల్ ఎవరు ఓట్లు ఎంతవరకు కొల్లగొడతారు అనేది.

అసలు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుగా కేఏ పాల్ ప్రచారం చాలా విచిత్రంగా సాగుతుంది. ఆయన నామినేషన్ వేసినా.. ర్యాలీ చేసినా.. ప్రత్యర్థులను విమర్శించినా.. ఆయన స్టైలే వేరు. తాజాగా ప్రచార సమయంలో ఆయన హావభావాలు వైరల్ గా అవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాల్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే ఆంధ్రాను అమెరికా, నర్సాపురాన్ని నార్త్ అమెరికా చేస్తానంటున్నారు. ఆ సమయంలో కిక్ బాక్సింగ్.. ప్లయింగ్ కిస్సెస్ వంటివి దారి పొడవునా పెట్టుకుంటూ ప్రచారంలో కేఏపాల్ చెలరేగిపోతున్నారు.