గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయం

SMTV Desk 2019-04-04 16:42:01  Avinash, Kodali nani

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌, ఆయన సోదరి షర్మిలపై గుడివాడ టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును షర్మిల విమర్శించడం అత్యంత దారుణమని అన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేకనే చంద్రబాబుపై జగన్, షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారని తెలిపారు. ఇది వారి దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పారు. గుడ్లవల్లేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అవినాష్ గుడివాడలో కొడాలి నాని వీధి రౌడీలను మించిపోయి అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ కావడంతోనే తాము మౌనగా ఉన్నామన్నారు. గుడివాడలో వైసీపీ ఓటమి ఖాయం అని తేలడంతోనే అరాచకాలు సృష్టించేలా నాని విమర్శలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

మంగ‌ళ‌వారం గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం లో ష‌ర్మిల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఆ స‌భ‌లో ష‌ర్మిళ చంద్ర‌బాబు లోకేష్ పై విమ‌ర్శ‌లు చేసారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం దేవినేని నెహ్రూ పైనా ఆరోప‌ణ‌లు చేసారు. వంగ‌వీటి రంగా హ‌త్య కేసు గురించి కొడాలి నాని ప్ర‌స్తావించం.. అందులో దేవినేని నెహ్రూ ప్ర‌మేయం ఉంద‌ని వ్యాఖ్యానించ‌టం మంగ‌ళ‌వారం నాటి స‌భ‌లో క‌ల‌క‌లం సృష్టించాయి. దీనికి ప్ర‌తి గా ఇప్పుడు దేవినేని అవినాశ్ సైతం కొడాలి నాని వీధి రౌడీగా పేర్కొన‌టం.. వీరిద్ద‌రి మ‌ధ్య పోరు మ‌రింత కీల‌కంగా మారుతోంది. ఇక‌, ఇప్పుడు దేవినేని అవినాశ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో గుడివాడ లో రాజ‌కీయాలు మ‌రింత హీట్ పుట్టిస్తున్నాయి.