హైదరాబాద్ లో భారీగా నగదు పట్టివేత

SMTV Desk 2019-04-04 16:40:18  Hyderabad, Money seized,

హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. దీంతో పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సీ పరిధిలో పోలీసులు గురువారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేశారు. కారులో తరలిస్తున్న రూ.49 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ నగదును ఓ కారులో నుంచి మరో కారులోకి మారుస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు