పిచ్చి మాటలు మాట్లాడేవారికి కాలమే సమాధానం చెబుతుంది

SMTV Desk 2019-04-04 16:37:12  Pawan Kalyan,

విజయవాడ: చంద్రబాబు, జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్‌కు ఊడిగం చేయకపోతే ఎవరినైనా అవకాశవాదులుగానే చిత్రీకరిస్తారని అన్నారు. మేము ఏంటో వాళ్లిద్దరికీ చూపిస్తానంటూ ఫైరయ్యారు. పిచ్చి మాటలు మాట్లాడేవారికి కాలమే సమాధానం చెబుతుంది. ఎవరు ఏం చేయాలో చెప్పడానికి చంద్రబాబు, జగన్, విజయసాయి రెడ్డి ఎవరు అని ప్రశ్నించారు.

పవన్‌ పోటీ చేస్తున్న గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయాలంటూ విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. ఈ సవాలుకు స్పందనగానే పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో జనసేన పార్టీ రహస్య పొత్తు పెట్టుకుందని వైసీపీ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే