భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మ‌హత్యాయానికి పాల్పడ్డ భర్త

SMTV Desk 2019-04-04 16:28:42  rajanna sirisilla district, man attempt to suicide

సిరిసిల్ల : తన భార్య తరుచూ వేధిస్తోందని ఓ భర్త ఆత్మ‌హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో చోటు చేసుకుంది. బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన నక్క నారాయణ టెక్స్ టైల్ పార్క్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా భార్యతో విభేదాలు తలెత్తటంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో భార్య తనపై దాడి చేస్తుందని నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నారాయణ భార్యను పిలిపించి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అయితే ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన నారాయణ బుధవారం మధ్యాహ్నాం సిరిసిల్లలో నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకున్నాడు. దీంతో స్థానికులు మంటలను ఆర్పివేసి, తీవ్రంగా గాయపడిన నారాయణను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.