CSK vs MI : బౌలింగ్ ఎంచుకున్న చెన్నై

SMTV Desk 2019-04-04 16:20:33  csk vs mi

ముంబై : ఐపిఎల్‌లో సీజన్లో భాగంగా నేడు ముంభై లోని వాంఖేడ్ స్టేడియం వేదికగా మరో అద్భుతమైన రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకుంది. ఈ సీజన్ ప్రారంభం నుండి చెన్నై సూపర్‌కింగ్స్‌ , ముంబై ఇండియన్స్ మాంచి ఫాంలో ఉన్నాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ వరుస విజయాలతో ముందుంది. ముంబై మాత్రం ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. ఈ రోజు రాత్రి 8 గంటలకు వాంఖడే స్టేడియం వేదికగా జరిగే చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. మరి ఈ రోజు చెన్నైని అడ్డుకునేందుకు రోహిత్‌ ఏ వ్యూహాలను రచించాడో, అవి ఫలిస్తాయో లేదో వేచిచూడాల్సిందే.

Mumbai Indians (Playing XI): Rohit Sharma(c), Quinton de Kock(w), Suryakumar Yadav, Yuvraj Singh, Kieron Pollard, Hardik Pandya, Krunal Pandya, Rahul Chahar, Jasprit Bumrah, Lasith Malinga, Jason Behrendorff.

Chennai Super Kings (Playing XI): Ambati Rayudu, Shane Watson, Suresh Raina, MS Dhoni(w/c), Kedar Jadhav, Dwayne Bravo, Ravindra Jadeja, Deepak Chahar, Mohit Sharma, Shardul Thakur, Imran Tahir.