ఈ రోజు రాత్రి ఫ్లైఓవర్లు బంద్...

SMTV Desk 2019-04-04 16:15:20  JAGNE KI RAAT, hyderabad flyovers closed

హైదరాబాద్ : బుదవారం రోజు ముస్లింల షబ్బెమేరాజ్ (జాగ్ నేకి రాత్) రాత్రి. అందరూ రాత్రి ప్రత్యేక ప్రార్థనలతో మసీదుల్లో, ఇళ్లల్లో జాగారాం చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇవాళ రాత్రి ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. రాత్రి ప్రత్యేక ప్రార్థనల కారణంగా సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా , రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు బుధవారం రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఫ్లైఓవర్లను మూసివేస్తున్నట్టు తెలిపారు. పివిఎన్‌ఆర్‌, గ్రీన్‌ల్యాండ్స్‌, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్లను మినహాయిస్తూ నెక్లెస్‌రోడ్డుతో సహా అన్నీ ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. దీనిని గమనించి వాహనదారులు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.