ఈ ఏడాది వర్షాలు తక్కువే!

SMTV Desk 2019-04-04 16:14:07  whether report, rainy season, winter season

వర్షకాలం వానలు అంతా వేసవి కాలం ఎండలపైనే ఆధార పది ఉంటుంది. ఇక రైతులు కూడా వేసవి రాగానే వర్షాకాలం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొన్ని సంస్థల అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం సాధారణ కంటే తక్కువే నమోదవుతుందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రముఖ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. ప్రతీ జూన్‌లో ఈశాన్య రుతుపవనాలు కేరళలో ప్రవేశించి, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని స్కైమెట్ సీఈవో జ‌తిన్ సింగ్ పేర్కొన్నారు. అలాగే లాంగ్ పీరియ‌డ్ రేంజ్‌(ఎల్‌పీఏ)లో రుతుప‌వ‌నాల ప్ర‌భావం 93 శాతం ఉంటుంద‌ని స్కైమెట్ అంచనా వేసింది. వ‌ర్ష‌పాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది సాధారణమే అని ఆ సంస్థ పేర్కొంది. 1951 నుంచి 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఎల్‌పీఏ వ‌ర్ష‌పాతం స‌గ‌టున‌ 89 సెంటీమీట‌ర్లు ఉంది. ఎల్‌నినో ప్రభావ వలనే ఈసారి వర్షాలు సాధారణ కంటే తక్కువగా ఉంటాయని స్కైమెట్ తెలిపింది.