ఏపీలో 350 నకిలీ ఈవీఎంలు

SMTV Desk 2019-04-04 16:11:18  ap, fake evm mechins, elections, assembly elections

అమరావతి : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా బయటపడ్డ డమ్మీ ఈవీఎంలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సందర్భంగా బుధవారం కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో 350 డమ్మీ ఈవీఎంలు బయటపడ్డాయి. దీంతో వెంటనే వాటిని జంగారెడ్డి గూడెంలోని ఆర్డీవో కార్యాలయానికి తరలించారు. వీటిని హైదరాబాద్ నుంచి విశాఖ పట్నానికి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కాగా ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు అక్రమంగా తరలిస్తున్న కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే.