హెరిటేజ్ ఫుడ్స్ చంద్రబాబుది కాదు ... మోహన్ బాబు సంచలనం

SMTV Desk 2019-04-04 16:10:04  Heritage foods, Mohan babu

సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుది కాదని, ఆ కంపెనీ తనదని మోహన్ బాబు అన్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌ను ‘నేను, చంద్రబాబు, దాగా అనే మరో స్నేహితుడి కలిసి స్థాపించాము’ అని తెలిపారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో తనదే ఎక్కువ పెట్టుబడి అని, చంద్రబాబుది తక్కువ పెట్టుబడని, తన స్నేహితుడైన దాగా అనే వ్యక్తిది మరింత పెట్టుబడి అని మోహన్ బాబు పేర్కొన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ స్థాపించిన కొద్దిరోజులకే చంద్రబాబు కొన్ని ఖాళీ పేపర్లు పంపించి సంతకాలు పెట్టామనారని, ఎందుకని తాను అడిగితే ఏదో చెప్పారని మోహన్ బాబు పేర్కొన్నారు. ఆ సమయంలో తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, చంద్రబాబు స్నేహితుడని నమ్మి, ఆయన చెప్పిన బ్లాంక్ పేపర్ల మీద సంతకాలు చేశానని మోహన్ బాబు తెలిపారు. అయితే కొద్దిరోజులు గడిచాక హెరిటేజ్ సంస్థతో తనకు సంబంధమే లేదని చంద్రబాబు మోసం చేస్తే, తాను కోర్టుకు కూడా వేళ్లాలనని మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే చంద్రబాబుకు పెద్దల అండదండలు ఉన్నాయని, వారితో మనం పెట్టుకోలేం, అని కుటుంబ సభ్యులు చెబితే కేసు వదిలేశానని మోహన్ బాబు పేర్కొన్నారు. ‘ఒక సినిమా తీసి, ఆ సినిమా ఫ్లాప్ అయింది అనుకున్నాను’ అని మోహన్ తెలిపాడు. కొద్దిరోజులకు మరో స్నేహితుడైన దాగానూ కూడా తనలాగే మోసం చేసి, చంద్రబాబు హెరిటేజ్ ఫుడ్స్‌ను లాగేసుకున్నారని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా తాను వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి తనకు విదేశాల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఆయన హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.