ఆ హీరో తో తొలిసారి రొమాన్స్ చేయనున్న కాజల్

SMTV Desk 2019-04-04 16:06:21  Kajal,

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత మాస్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు హీరో గోపిచంద్. వరస మాస్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన గోపిచంద్ ప్రస్తుతం బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళనుంది.