ఆ ఇద్దరు ఓడిపోవడం ఖాయం

SMTV Desk 2019-04-04 16:04:43  Chinni krihsna, Pawan kalyan

భీమవరంలో పవన్ కల్యాణ్, నరసాపురంలో నాగబాబు ఇద్దరూ ఓడిపోతారని సినీ రచయిత, వైసీపీ నేత చిన్నికృష్ణ జోస్యం చెప్పారు. గతంలో చిరంజీవికి ఓట్లు వేసినందుకు ఏం జరిగిందో అందరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. ఇప్పుడు అదే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులొచ్చి ఓట్లు అడుగుతున్నారని.. వారిని ప్రజలు నమ్ముతారా..? అంటూ ప్రశ్నించారు. నరసాపురం నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్లిన చిన్నికృష్ణ పై వ్యాఖ్యలు చేశారు. రఘురామ కృష్ణంరాజుకు నాగబాబు ఏ విధంగానూ పోటీకాదని.. నాగబాబు ఓటమి ఖాయమని చిన్నికృష్ణ అన్నారు. అటు భీమవరంలోనూ పవన్ ఓడిపోతారని తెలిపారు. అభిమాన హీరోల సినిమాలు పదిసార్లు చూసినా.. ఓటు మాత్రం వైసీపీకే వేయాలని చిన్ని కృష్ణ యువతకు పిలుపునిచ్చారు.