ఎన్నికల బరిలోకి ‘భార్యాబాధితుల’ సంఘం అధ్యక్షుడు

SMTV Desk 2019-04-04 15:56:58  Elections,

నిత్యం భార్యల వేధింపులకు గరయ్యే భర్తలకు ఏర్పాటైన స్వచ్ఛంద సంస్థ ‘అఖిల భారతీయ పత్నీ అత్యాచార్ విరోధి సంఘ్’ అధ్యక్షుడు దశరథ్ దేవదా లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిచారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మంగళవారం దశరథ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే భార్య, అత్తమామల చేతిలో వేధింపులకు గురవుతున్న భర్తలకు న్యాయం చేస్తానని, ఈ అంశాన్ని పార్లమెంట్ కు తీసుకెళ్లి, పోరాడతానని హామీ ఇచ్చారు.

దశరథ్ ఎన్నికల బరిలో దిగడం ఇది మొదటిసారి కాదు. 2014లో లోక్ సభ ఎన్నికలు, 2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు 2,300 ఓట్లు రాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో 400 ఓట్లు వచ్చాయి. అందరు అభ్యర్థుల్లా ప్రచారంలో డబ్బులు పంపిణీ చేయనని, కేవంలం ఇంటింటికెళ్లి ఓట్లు అడుగుతానని దశరథ్ పేర్కొంటున్నారు. పురుషులకు జాతీయ కమిషన్ తీసుకొచ్చేందుకే దశరథ్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 69వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు.