పోర్న్‌సైట్స్ చూస్తె వారు జాగ్రత్త!

SMTV Desk 2019-04-03 18:22:26  porn sites, hacker, britain

బ్రిటన్‌ : ప్రపంచంలో పోర్న్ సైట్లను చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని అనేక సర్వే సంస్థలు తెల్చేశాయి. అయితే ఆ సైట్ల వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. అందులో భాగంగానే పోర్న్ సైట్లను చూసే వారిపై నిఘా పెట్టి వారి దగ్గర నుండి డబ్బులు రాబట్టుకుంటున్నాడు. పూర్తి వివరాల ప్రకారం...బ్రిటన్‌కు చెందిన జయిన్ కైసర్ అనే హ్యాకర్.. పోర్న్‌సైట్లను చూసే వారిని టార్గెట్ చేసుకుని 7 లక్షల పౌండ్లకు(రూ. 6.3 కోట్లు) పైగా సొమ్మును వసూలు చేశాడు. అతడు మొదట యూజర్లకు ఓ కరప్టడ్ యాడ్ పంపేవాడు. దాన్ని క్లిక్ చేస్తే ‘మీరు నేరం చేశారు. వెయ్యి డాలర్లు చెల్లించండి’ అని మెసేజీ వచ్చేది. పరువు పోతుందని భయపడి చాలామంది యూజర్లు ఆ యాడ్‌కు లింకయి ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేశారు. వెయ్యని వారిని అతడు బ్లాక్ మెయిల్ చేశాడు. హ్యాకర్ కనుక మొత్తం డేటాను లాగేసి ఇబ్బంది పెట్టాడు. ఇలా వచ్చిన సొమ్ముతో కైసర్ రోలెక్స్ వాచీ కొని, ఖరీదైన హోటళ్లలో అమ్మాయిలతో గడిపాడు. జూదమాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గుట్టురట్టయింది. కైసర్ బాగానే చదువుకున్నాడని, ఈజీ మనీ కోసం ఇలాంటి అడ్డదారులు తొక్కాడని పోలీసులు చెప్పారు. అతనిపై మొత్త 17 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం బెయిల్ పై తిరుగుతున్నాడు.