చైనా మేథోశక్తి గురించి విచారణకు ఆదేశించిన ట్రంప్!

SMTV Desk 2017-08-15 11:20:45  NEW JERSY, CHAINA, AMERIKA, IPR, TRUMP.

న్యూజెర్సీ, ఆగస్ట్ 15 : చైనాకున్న మేథోశక్తి ఎంత? వారి మేథస్సు లెక్కలను బయటకు తీయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశించారు. చైనా, తమ ఐపీఆర్(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్-మేథస్సు హక్కులు)లను అమెరికా దొంగిలిస్తుందని ఆరోపిస్తున్న వేళ ట్రంప్.. పై విధంగా స్పందించారు. చైనా ఐపీఆర్ హక్కులపై విచారించాలన్న దస్ర్తంపై సంతకం చేసిన ఆయన ఆపై నార్త్ కొరియా నిర్వహిస్తున్న అణు పరీక్షలు, అక్కడ నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమెరికాకు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్న తరుణంలో ఈ విచారణ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను సంక్లిష్టం చేస్తుందని, అంతేకాక ట్రంప్ ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం కీలక చర్యగా దౌత్యాధికారులు భావిస్తున్నారు. కాగా చైనా సుమారు 600 బిలియన్ డాలర్ల విలువైన ఐపీఆర్ హక్కులను దొంగతనం చేసిందని ట్రంప్ పరిపాలనా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నిజానిజాలను వెలికి తీయాలని ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.