‘బాహుబలి 3' లో డేవిడ్ వార్నర్!

SMTV Desk 2019-04-03 18:20:17  david warner, kane willaimson, bahubali, srh, ipl 2019

హైదరాబాద్ : ఐపీఎల్‌ 2019 సీజన్లో పునరాగమనం చేసిన డేవిడ్ వార్నర్‌ తాజాగా టీమ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో కలిసి డేవిడ్ వార్నర్ ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటిన ‘బాహుబలి’ సినిమా సిరీస్‌లో తనకి నటించాలని ఉన్నట్లు వార్నర్ వెల్లడించాడు. దీనిపై బాహుబలి టీమ్‌ కూడా పాజిటివ్‌గా స్పందించింది. ‘డేవిడ్ వార్నర్.. బాహుబలి సినిమాలో నటించాలని నువ్వు చెప్పిన మాటల్ని మేము విన్నాము. అయితే.. ఎవరు పక్షాన నువ్వు నిలబడతావు..? బాహుబలి (ప్రభాస్) లేదా భల్లాలదేవుడా(రానా)..? సరే.. బాహుబలి 3 షూటింగ్‌కి సిద్ధంగా ఉండు’ అని బాహుబలి టీమ్‌ ట్వీట్ చేసింది. అంతేకాకుండా.. ఐపీఎల్‌‌‌లో మిగిలిన మ్యాచ్‌ల్లోనూ వార్నర్ రాణించాలని ఆకాంక్షించిన బాహుబలి టీమ్.. ఇలానే దూకుడుగా ఆడాలని కోరింది.