న్యూజిలాండ్‌ వరల్డ్ కప్ టీం

SMTV Desk 2019-04-03 16:55:57  newzealand, icc world cup 2019

వెల్లింగ్టన్‌ : ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం ప్రారంభం కానున్న ఐసిసి వరల్డ్ కప్ 2019 కోసం న్యూజిలాండ్‌ 15 మంది సభ్యుల టీమ్‌ను ప్రకటించింది. ప్రస్తుతం వన్డేల్లో ఇంగ్టండ్‌, ఇండియా తర్వాత మూడో స్థానంలో న్యూజిలాండ్‌ ఉంది. అయితే 2015లో మిస్సయిన వరల్డ్‌కప్‌ను ఈ సారి ఎలగైనా పట్టుకోవాలని న్యూజిలాండ్‌ భావిస్తుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లలో బ్యాలెన్‌స ఉండేలా టీమ్‌ను ఎంపిక చేశారు. జూన్‌ 1న కార్డిఫ్‌లో శ్రీలంకతో జరగబోయే మ్యాచ్‌తో న్యూజిలాండ్‌ తమ వరల్డ్‌కప్‌ ఆటను మొదలుపెట్టనుంది.

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, కొలిన్ మన్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నికోల్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, రాస్ టేలర్.