రచ్చలేపుతున్న పాయల్ రాజ్ పుత్ స్పెషల్ ఐటం సాంగ్

SMTV Desk 2019-04-03 16:52:42  payal rajput, seetha, item song,

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సీత. శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుంది. కొద్ది గంటల క్రితం పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. బుల్లెట్ మీదొచ్చే బుల్ రెడ్డి అంటూ మాంచి మాస్ బీట్ లో ఈ సాంగ్ వచ్చింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని పాయల్ సాంగ్ అదిరిపోయింది.



ఆరెక్స్ 100 సినిమాతో యూత్ ఆడియెన్స్ ను అలరించిన పాయల్ రాజ్ పుత్ మరోసారి సీతలో స్పెషల్ ఐటం లో దుమ్ముదులిపేస్తుంది. పాయల్ అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈ ఐటం సాంగ్ ఉంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సత్తా చాటిన తేజ మరోసారి ఈ సీతతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ సీత ఎలా ఉంటుందో చూడాలి.