కిచ్చ సుదీప్ కు కోర్టు అరెస్ట్ వారెంట్!

SMTV Desk 2019-04-03 15:14:20  kichha sudeep, eega movie, arrest warrent , kichha sudeep get arrest warrent

బెంగళూరు : తెలుగులో ఈగ సినిమాతో పరిచయమైన కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ కు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తాజాగా కాఫీ ఎస్టేట్ వివాదంలో సుదీప్ కోర్టు ముందు హాజరు కాలేదు. అయితే ఈ విషయంపై ఆగ్రహించిన చిక్ మంగళూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మే 22వ తేదీలోపు సుదీప్ ఆచూకీ తెలుసుకొని న్యాయస్థానం ముందు హాజరు పరచాల్సిందిగా కర్నాటక పోలీసులను ఆదేశించింది. 2016లో కన్నడ టీవీ షో ‘వారసదార’ షూటింగ్ కోసం దీపక్ పటేల్ అనే వ్యక్తికి చెందిన కాఫీ ఎస్టేట్ ను సుదీప్ అద్దెకు తీసుకున్నారు. దీనికోసం రూ.80 లక్షలు చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్ గా రూ.50 వేలు ఇచ్చారు. అనంతర మిగిలిన డబ్బు చెల్లించాలని కోరిన అప్పుడు ఇప్పుడు అని తప్పించుకు తిరుగుతున్నారట. దాంతో దీపక్ చేసేదేమిలేక సుదీప్, సుదీప్ కి చెందిన నిర్మాణ సంస్థ, డైరెక్టర్ మహేష్ లపై కేసు వేశారు. తనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసును విచారించిన కోర్టు సుదీప్ ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేయాల్సిందిగా కర్నాటక పోలీసులను ఆదేశించింది.