అక్కడ తాకిన బోనీ కపూర్..వైరల్ అవుతున్న వీడియో

SMTV Desk 2019-04-03 15:00:17  Boney kapoor, Urvashi

బాలీవుడ్ అందాల నటి ఊర్వశీ రౌటేల వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఆమెను పిరుదుల భాగంలో చేతితో కొట్టినట్లు ఉన్న ఆ వీడియోపై విమర్శల వర్షం కురుస్తోంది. బోనీ కపూర్ వేయకూడని చోట చేయి వేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లతో విరుచుకు పడుతున్నారు. మీ కూతురు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారనే విషయం మీకు గుర్తు లేదా? ఆమెను కూడా ఇలాగే ఎవరైనా చేస్తే మీకు బాధ అనిపించదా? అంటూ విమర్శలు చేస్తున్నారు.



ఈ వార్తలపై ఊర్వశి రౌతెలా ఘాటుగా స్పందించారు. ఓ వెబ్‌సైట్‌లో రాసిన ఆర్టికల్, దానిలో పెట్టిన వీడియోను కోట్ చేస్తూ ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు.

‘గౌరవనీయులైన బోనీ కపూర్ సార్‌తో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టి నన్ను ట్రోల్ చేయడాన్ని ఈరోజు ఉదయం చూసి షాక్‌కు గురయ్యాను. చాలా బాధపడ్డాను. ఆయన నిజమైన జెంటిల్‌మేన్. ఒకరి పరువు ప్రతిష్టల గురించి కనీసం ఆలోచించకుండా మీడియా, సోషల్ సైట్లు ఇలాంటి వాటిని పెట్టడం నన్ను ఎంతగానో బాధిస్తోంది. దయచేసి అందరూ ఈ ట్రోలింగ్‌ను ఆపండి. నిజాయతీగా చెబుతున్నాను బోనీ కపూర్ గారంటే నాకెంతో గౌరవం. ఆయన ఎంతో మర్యాదస్థులు’ అని ఊర్వశి ట్వీట్ చేశారు.