ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాటుగా

SMTV Desk 2019-04-03 12:35:08  Mahendra Singh Dhoni.

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీకి... క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనేందుకు ఎన్నో ఉదాహరణలు. ఎప్పుడో 2011 జులై 18న ధోనీ వాడిన బ్యాట్‌ను లండన్‌లోని ఈస్ట్ మీట్స్ వెస్ట్ చారిటీ డిన్నర్‌లో వేలంలో పెట్టగా... అది $1,61,295 (రూ.1,10,81,531)కి అమ్ముడైంది. R K గ్లోబల్ షేర్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఇండియా) ఆ బ్యాటును దక్కించుకుంది. ఆ బ్యాట్‌తో 2011లో వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ మ్యాచ్ ఆడాడు ధోనీ. ఆ మ్యాచ్‌లో ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అందువల్ల ఆ బ్యాటుకి క్రేజ్ పెరిగిపోయింది. మరే క్రికెట్ బ్యాటూ అంత రేటు పలకకపోవడంతో... ప్రపంచంలో అత్యంత ఖరీదైన బ్యాటుగా ఇప్పటికీ దానిపైనే రికార్డు నిలిచివుంది.

మిస్టర్ కూల్‌గా పేరున్న మహేంద్ర సింగ్ ధోనీ... అన్ని ఫార్మాట్లలోనూ సత్తా చాటి... ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. హెలికాప్టర్ షాట్ ఆయనకే ప్రత్యేకం. మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగి ఎన్నో సందర్భాల్లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ధోనీ సారథ్యంలో టీంఇండియా 2007 ఐసీసీ వరల్డ్ కప్ టీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మరియు 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది.