పబ్‌జీగేమ్ కి మరో యువకుడు బలి

SMTV Desk 2019-04-03 12:30:09  Pubg,

సెల్ ఫోన్‌లో పబ్‌జీగేమ్ ఆడొద్దని చదువు కోవాలని ఓ తల్లి కొడుకును మందలించడంతో మన స్తాపానికి గురై బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 1,700 మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సంజీవ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… విష్ణు పురి కాలనీలో నివాసముండే కె.భరత్ రాజ్‌కు భార్య, ఒక కూతురు, కుమారుడు సాంబ శివ(16) ఉన్నారు. బాలుడు స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. బాలుడు తరచూ సెల్ ఫోన్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతుండటంతో తల్లి ఉమాదేవి గేమ్‌లు ఆడవద్దని మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు తన బెడ్ రూమ్ లోకి వెళ్ళి ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తల్లి గమనించి చుట్టు పక్కల వారి సహాయంతో రూమ్ తలుపులు తెరిచి బాలుడిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందాడని చెప్పారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.