ఇండియాలో తొలి ఇంటర్నెట్ కారు

SMTV Desk 2019-04-03 12:22:08  Upcoming Cars in India 2019, MG Hector SUV 2019, MG Hector, Indias first connected SUV

బ్రిటిష్ కు చెందిన ఎంజీ మోటార్ కంపనీ ఇప్పుడు ఇండియాలో ప్రవేశించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే తాజాగా తన హెక్టర్ అనే తొలి కారును ప్రదర్శించింది. భారతదేశపు తొలి ఇంటర్నెట్ కారు ఇదే. అంతేకాదు ఈ కారులో ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దేశీ వాహన పరిశ్రమలో ఇంతకు ముందులేని ఫీచర్లు కూడా మనం ఈ ఎస్‌యూవీలో చూడొచ్చు. ఎంజీ హెక్టర్‌లో అతిముఖ్యమైన ఫీచర్ ఐస్మార్ట్ వ్యవస్థ. మనకు మన తల ఎలానో.. కారుకు ఇది కూడా అలా. దీని ద్వారా మొత్తం కారునే కంట్రోల్ చేయవచ్చు. ఇది 10.4 అంగుళాల ట్యాబెట్ రూపంలో ఎం2ఎం సిమ్ కార్డును కలిగి ఉంటుంది. 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానమౌతుంది. అంతేకాదు భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది ఎమర్జెన్సీ కాల్స్, వెహికల్ స్టేటస్, సన్‌రూఫ్ క్లోజ్, డోర్ లాక్ ఇలా చాలా పనులు చేసేస్తుంది.

హెక్టర్‌లో కారు ప్రత్యేకతలు :

✺ ఓనర్ తన స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో కారుతో కనెక్ట్ కావొచ్చు. కారులో లేకున్నా కూడా సన్ రూఫ్ ఓపెన్ చేయడం, డోర్ లాక్ చేయడం వంటివి చేయవచ్చు.
✺ ఎమర్జెన్సీ కాల్ ఫీచర్ ఒకటి ఉంటుంది. ఇది 24/7 పల్స్ హబ్‌కు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఉదాహరణకు కారు ప్రమాదానికి గురైతే.. ఇ-కాల్ యాక్టివేట్ అవుతుంది. పల్స్ హబ్‌కు కార్ లొకేషన్‌తో కూడిన టెక్ట్స్ మెసేజ్ వెళ్తుంది. అలాగే రిజిస్టర్డ్ ఎమర్జెన్సీ నెంబర్‌కు కూడా మేసేజ్ పోతుంది. దీంతో పల్స్ హబ్ తక్షణ సహాయక చర్యలు తీసుకుంటుంది.
✺ కారులో 360 డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వ్యవస్థ, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, ఫోన్ అండ్ సిస్టమ్ అలర్ట్స్ వంటి ప్రత్యేకతలున్నాయి.✺ ఎంజీ హెక్టర్ మే నెలలో మార్కెట్‌లో లాంచ్ చేయనుంది. జూన్ నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశముంది. జీప్ కంపాస్, టాటా హరియర్ వంటి మోడళ్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది. దీని ధర రూ.17 నుంచి రూ. 20 లక్షల మధ్యలో ఉండొచ్చు.
✺ కారులోని జీఎస్ఎం వ్యవస్థ ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో ట్రాఫిక్ అప్‌డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఏ మార్గంలో వేగంగా గమ్య స్థానాన్ని చేరుకోవచ్చో చూపిస్తుంది.
✺ హెక్టర్‌లో వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. హెలో ఎంజీ అన్ని చెబితే ఇది యాక్టివేట్ అవుతుంది.
✺ కంపెనీ ఈ కారు తయారీ కోసం గ్లోబల్ టెక్ కంపెనీలనైన మైక్రోసాఫ్ట్, అడోబ్, అన్‌లిమిట్, ఎస్ఏపీ, సిస్కో వంటి వివిధ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే గానాతో కూడా ఒప్పందం కలిగి ఉంది.