దక్షిణ భారత దేశానికి అండగా కాంగ్రెస్

SMTV Desk 2019-04-02 18:31:55  congress party, bjp, modi, rahul gandhi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణ భారత దేశాన్ని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో తాను కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాక దక్షిణ భారత దేశానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీకి సౌతిండియాతో శత్రుత్వం ఉందని విమర్శలు గుప్పించారు. వయనాడ్ నుంచి తాను పోటీ చేస్తున్నందుకు వామపక్షాలు అసంతృప్తిగా లేవని, దేశ వ్యాప్తంగా వామపక్షాలతో పొత్తు ఉందని, లెఫ్ట్ పార్టీలతో ఎలాంటి ఇబ్బందులు లేవని రాహుల్ పేర్కొన్నారు. హిందువులంటే రాహుల్ కు భయం వేస్తుందని, ముస్లింలు ఎక్కువగా ఉన్న వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని బిజెపి నాయకులు ఎద్దేవా చేశారు.