సాక్షి-ధోనీ...బెయిర్ స్టో-..?...వైరల్ పిక్

SMTV Desk 2019-04-02 18:28:58  srh, ipl 2019, jon bairstow, sakshi, dhoni

హైదరాబాద్ : టీంఇండియా సంచలన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని-సాక్షిల లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. అయితే ఇదే తరహాలో మరో లవ్ స్టొరీ రిపీట్ కానుంది అని ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ జానీ బెయిర్ స్టో.. ఓ హోటల్ మహిళా ప్రతినిధి కలిసి ఉన్న ఫొటోను చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హైదరాబాద్ జట్టు తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 4న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో ఢిల్లీ జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్కడున్న హోటల్ సిబ్బంది సన్ రైజర్స్ టీం మెడలో కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలో జానీ బెయిర్ స్టో మెడలో కండువా కప్పగానే కాస్త సమయం వరకూ కళ్లు కలిసాయి. అప్పుడే కెమెరా క్లిక్‌మనిపించింది.