నయనతారలో ఈ టాలెంట్ కూడా ఉందా..??

SMTV Desk 2017-08-14 18:16:09  nayanatara, aram movie, hobby, pramotions

హైదరాబాద్, ఆగస్ట్ 14 : లేడి ఓరియె౦టెడ్ చిత్రాలకు సరిగ్గా సరిపోయే అందం నయనతారది. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో నటించి అభిమానుల మనసు గెలుచుకోవడమే కాకుండా భారీ సంఖ్యలోనే అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడానికి, సినిమా ప్రమోషన్స్ కి హాజరుకావడానికి ఇష్టపడదు. అలాంటిది "అరమ్" చిత్రంలో పాల్గొనడం ఒక విశేషం అనే చెప్పొచ్చు. అయితే నయనకు ఒక హాబీ కూడా ఉందండోయ్..! ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటారట. కాని తను రాసిన కవితలు ఇంతవరకు ఎవరికీ చూపించలేదని తెలిపింది ఈ సుందరి. నయనతారలో ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. మరి ఆ కవితలను పుస్తక రూపంలోకి తెస్తుందో లేదో చూడాలి మరి.