అమెరికాలో నకిలీ విసాలతో పట్టుపడ్డ భారతీయులు

SMTV Desk 2019-04-02 18:20:22  usa, india, america, fake visa, h-1b visa

కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను వారిపై నకిలీ హెచ్‌1బీ వీసా కేసును నమోదు చేసి అరెస్ట్ చేశారు. కిషోర్ దత్తపురం, కుమార్ అశ్వపతి, సంతోష్ గిరిలను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురూ నకిలీ హెచ్‌1బీ వీసాల కోసం దరఖాస్తు చేసినట్లు ప్రాసిక్యూటర్ డేవిడ్ అండర్సన్ తెలిపారు. అయితే ఈ ముగ్గుర్నీ బెయిల్‌పై రిలీజ్ కూడా చేశారు. నానోసిమాంన్‌టిక్స్ కంపెనీ పేరుతో ముగ్గురూ ఓ కన్సల్టెన్సీ నడిపించారు. వర్కర్ల కోసం నకిలీ హెచ్‌1బీ వీసాలను వీళ్లు జారీ చేశారు. ఉద్యోగాలు లేని వారి కోసం కూడా వీళ్లు వీసాలను ఇచ్చారు.