బెంగళూరు vs రాజస్థాన్ : గెలుపు రుచి తెలియని జట్ల మధ్య పోరు

SMTV Desk 2019-04-02 18:18:28  rcb vs rr, ipl 2019, rahane, virat kohli

జైపూర్ : ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ ప్రారంభం నుండి ఇప్పటివరకు గెలుపు లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు జైపూర్ వేదికగా తలపడనున్నాయి. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎవ్వరికో ఒకరికి ఒక పాయింట్ వస్తుంది. టోర్నీ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శనతో బెంగళూరు జట్టు మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపచగా.. గెలుపు ముంగిట రాజస్థాన్ బోర్లాపడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. కనీసం ఈరోజైనా మ్యాచ్‌లో గెలిచి బోణి కొట్టాలని రెండు జట్లూ ఆశిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ దెబ్బకి 7 వికెట్ల తేడాతో ఓడిన బెంగళూరు టీమ్.. ఆ తర్వాత ముంబయితో మ్యాచ్‌లో గెలిచే అవకాశాలు కనిపించినా.. ఆఖర్లో తడబడి విజయానికి దూరమైంది. ఇక ఇటీవల హైదరాబాద్ జరిగిన మ్యాచ్‌లో మరీ ఘోరంగా 118 పరుగుల భారీ తేడాతో ఓడిపోయి ఇప్పుడు పూర్తి నిరాశలో కూరుకుపోయింది. కెప్టెన్ కోహ్లీ కనీసం ఈ మ్యాచ్‌లోనైనా.. జట్టుని ముందుండి నడిపిస్తాడేమో..? చూడాలి..! ఇక రాజస్థాన్ రాయల్స్.. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పంజాబ్‌పై గెలిచేలా కనిపించినా.. అశ్విన్ మాన్కడింగ్ రనౌట్ కారణంగా.. ఆఖర్లో ఒత్తిడికి గురై 14 పరుగుల తేడాతో విజయాన్ని దూరం చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్.. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌పై దాదాపు గెలిచేసేలా కనిపించింది. కానీ.. చివర్లో డ్వేన్ బ్రావో.. బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంతో 8 పరుగుల తేడాతో ఓడింది.