అమ్మకాల్లో టాప్ లో హీరో బైక్స్

SMTV Desk 2019-04-02 18:15:20  hero bikes, hero company, indias top selling bikes hero

దేశంలో అన్ని కంపెనీల టూవీలర్ విభాగంలో టాప్ లో హీరో మోటొకార్ప్‌ నిలిచింది. టాప్-10 బైక్స్‌లో 4 మోడళ్లు ఈ కంపెనీవే ఉన్నాయి. ఇక దీని తర్వాతి స్థానం బజాజ్‌ది. ఈ కంపెనీకి చెందిన 3 బైక్స్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. ఇక వీటి తర్వాతి స్థానంలో హోండా, టీవీఎస్ ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో హీరో స్ల్పెండర్ బైక్ అమ్మకాలు 2,44,241 యూనిట్లుగా ఉన్నాయి. భారతీయులు ఎక్కువగా కొంటున్న బైక్ ఇదే. దీని తర్వాతి స్థానంలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది. దీని అమ్మకాలు 1,84,396 యూనిట్లుగా ఉన్నాయి. మూడో స్థానంలో హోండా సీబీ షైన్ ఉంది. దీని విక్రయాలు 86,355 యూనిట్లుగా ఉన్నాయి. 4వ స్థానం బజాజ్‌ది. బజాజ్ పల్సర్ బైక్ అమ్మకాలు 84,151 యూనిట్లుగా ఉన్నాయి. ఇక్కడ హోండా సీబీ షైన్‌కు, బజాజ్ పల్సర్‌కు మధ్య అమ్మకాలు వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఇక వీటి తర్వాతి స్థానాల్లో హీరో ప్యాషన్, బజాజ్ ప్లాటిన, హీరో గ్లామర్, ఆర్ఈ క్లాసిక్ 350, బజాజ్ సీటీ, టీవీఎస్ అపాచీ బైక్స్ ఉన్నాయి.