కొహ్లి విత్ సన్ని లియోన్

SMTV Desk 2019-04-02 16:36:00  Kohli, sunny leone,

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లి, బాలీవుడ్ హాట్ స్టార్ సన్ని లియోన్ ఓ చోట కలిస్తే.. ఇద్దరి ఫ్యాన్స్ కు అదో పెద్ద పండుగే. ఎయిర్ పోర్ట్ లో సన్నితో పాటుగా విరాట్ కొహ్లి లానే అనిపించే ఓ వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. అది చూసిన ఒకతను అది వీడియో తీసి వైరల్ భయాని అనే ఇన్ స్టా ఎకౌంట్ లో పోస్ట్ చేశాడు. అచ్చం కొహ్లి లా అనిపించే ఆ వ్యక్తిని చూసి మ్యాచ్ ఆడాల్సిన ఒక్కసారిగా తాను షాక్ అయ్యానని మెసేజ్ పెట్టాడు.



అయితే వీడియో పెట్టిన కొద్ది క్షణాల్లోనే అది వైరల్ గా మారింది. కొహ్లి విత్ సన్ని ఇదవరకు వారిద్దరు కలిశారో లేదో కాని ఈ వీడియో చూసిన వారు మాత్రం వారిద్దరే అని నమ్మేలా ఉన్నారు. కచ్చితంగా సన్ని కూడా విరాట్ లాంటి పోలికలు ఉన్నాయి కాబట్టే అతనితో మాటలు కలిపింది కావొచ్చని అంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో మీరు ఓసారి చూసేయండి..