ప్రీతి జింటా డ్యాన్స్...వీడియో వైరల్

SMTV Desk 2019-04-02 16:10:24  preeti zinta, kxip vs dc, ipl 2019

మొహాలీ : ఐపిఎల్‌లో భాగంగా సోమవారం మొహాలీలో ఢిల్లీ క్యాపిటల్‌స కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు మధ్య జరిగన మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. దీంతో మైదానంలోకి పరుగెత్తుకెళ్లి బాలీవుడ్‌ నటి, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ యజమాని ప్రీతి జింటా తనదైన రీతిలో ఆటగాళ్లకు అభినందనలు తెలిపింది. ఎంతో ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ఢిల్లీ ఓటమి చవిచూసేలా చేశాడు. దీంతో మ్యాచ్ అనంతరం పంజాబ్ జట్టు యజమాని ప్రీతి.. మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లందరికీ అభినందనలు తెలిపింది. అయితే కరన్‌ దగ్గరకు రాగానే.. అతను భాంగ్రా డాన్స్ చేశాడు. దీంతో ప్రితీ కూడా తనతో పాటు భాంగ్రా నృత్యం చేసి అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.