కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్యాకు నోటీసులు

SMTV Desk 2019-04-02 16:07:30  Hardik pandya, KL Rahul, BCCI, Karan johar, Coffee with karan show, notices, ipl 2019

ముంభై : టీం ఇండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌ కాఫీ విత్ కరన్ టీవీ కార్యక్రమంలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం వల్ల వీరిద్దరిపై వేటు కూడా పడింది. అయితే తాజాగా బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో పాండ్యా, రాహుల్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసిన సీవోఏ.. ఆ తర్వాత సస్పెన్షన్‌ను ఎత్తివేసినా.. అంబుడ్స్‌మన్‌ విచారణ మాత్రం పెండింగ్‌లో ఉంది. ఈక్రమంలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ గత వారం హర్దిక్‌, రాహుల్‌లకు నోటీసులు జారీ చేశానని బీసీసీఐ అంబుడ్స్‌మన్‌, రిటైర్డ్‌ జస్టిస్‌ డీకే జైన్‌ తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్‌లో బిజీగా ఉన్నప్పటికీ ఈనెల 11 లోపు అంబుడ్స్‌మన్‌ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది.