కోహ్లీ సరికొత్త రికార్డు!!!

SMTV Desk 2017-08-14 17:34:38  Pallekela test, India- srilanka Test series, 85 years India Record

పల్లెకెలె, ఆగస్ట్ 14: భారత్-శ్రీలంక మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ శనివారం పల్లెకెలెలో ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కూడా భారత్ ఘన విజయాన్ని కైవసం చేసుకుంది. కాగా, ఇప్పటికే మొదటి, రెండవ టెస్టుల్లోనూ గెలిచిన భారత్ చివ‌రిటెస్టులోనూ విజయం సాధించడంతో విదేశీ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రికార్డును సాధించింది. దీంతో 85 ఏళ్ల టెస్టు చ‌రిత్ర‌ కలిగిన భారత్ విదేశాల్లో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినందుకు భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడిన శ్రీలంక 171 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. ఈ రోజు 19/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు భారత్ బౌలర్లు అశ్విన్ (4 వికెట్లు), మహ్మద్ షమీ (3 వికెట్లు) ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. కేవలం 181 పరుగులకే ఆలౌట్ అయ్యి పెవిలియన్‌కి చేరారు. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ 4, ష‌మీ 3, ఉమేశ్‌ యాదవ్ 2, కుల్‌దీప్ యాద‌వ్ 1 వికెట్లు తీసారు.