మోహన్ బాబుకు బెయిల్ మంజూరు

SMTV Desk 2019-04-02 16:02:25  mohan babu

ప్రముఖ‌ నటుడు మంచు మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, ఏ2గా మంచు మోహన్‌బాబును కోర్టు తేల్చింది. ఏడాది జైలు శిక్ష అని తీర్పురాగానే ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఒకింత షాక్‍కు గుర‌య్యారు.

అయితే… తీర్పు వచ్చిన కాసేపటికే మోహన్ బాబు తరపు న్యాయవాది ఎర్రమంజిల్ కోర్టులో బెయిల్ పిటిషన్‌‌ దాఖలు చేశారు. కోర్టు బెయిల్ మంజూరు చేసి 30 రోజులు గడువు ఇచ్చింది.