ప్రభాస్ తో మజిలీ భామ ?

SMTV Desk 2019-04-02 15:59:42  Prabhas, Samantha

ప్రస్తుతం ‘మజిలీ’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సమంతా.. త్వరలోనే స్టార్ హీరో ప్రభాస్ తో ఒక చిత్రంలో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. స్టార్ హీరో ప్రభాస్ తో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతాను తీసుకోనున్నారని సమాచారం. ఇక ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్, సమంతా ఇప్పటివరకు కలిసి ఒక చిత్రంలో కూడా నటించలేదు. ఇక ఈ వార్త నిజమైతే చాలా బాగుంటుందని ప్రభాస్ అభిమానుల ఆశిస్తున్నారు.