టిక్ టాక్ వీడియో చూసి ఘరానా దొంగలని పట్టుకున్న పోలీసులు

SMTV Desk 2019-04-02 13:56:35  tiktok, police arrested

యువతను ఉర్రుతలూగిస్తున్న సోషల్ మీడియా సంచలనం టిక్ టాక్ యాప్.. ఇద్దరు యువకుల పట్ల శాపంగా మారింది. నేరాలు చేసి తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు నేరస్తులను ఓ టిక్ టాక్ వీడియో పట్టించింది. వివరాల్లోకి వెళితే..ఢిల్లీకి చెందిన షహజాదా పర్వేజ్ (24), మోను (23) అనే ఇద్దరు నేరస్తుల కోసం పోలీసులు ఎప్పటి నుంచో గాలిస్తున్నారు. ఇటీవల వీరిద్దరు ఓ పార్టీలో చేతిలో ఆయుధాలు పట్టుకుని తమంచే పే డిస్కో అనే పాటకు టిక్ టాక్ వీడియోలో డ్యాన్స్ చేశారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి పోలీసులకు చిక్కింది. దీంతో వారు విపిన్ గార్డెన్ ఏరియాలో ఉన్నారని తెలుసుకొని వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి ఒక దేవీ పిస్టల్‌‌తోపాటు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు ఉత్తమ్‌నగర్‌లో ఉన్న షాహజాద్ తండ్రి చికెన్ షాప్‌లో పనిచేస్తునే.. నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిని పలు కేసులలో గాలిస్తున్నట్టు తెలిపారు.